Gyanesh Kumar Supreme Court Plea | ఓటర్ల సవరణ వివాదం: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో వచ్చిన కథనం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gyanesh Kumar Supreme Court Plea | కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలో వచ్చిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా తీసుకున్న ఎస్ఐఆర్ నిర్ణయాలన్నింటినీ చట్టవిరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.

Gyanesh Kumar Supreme Court Plea | పిటిషన్‌లో డిమాండ్లు ఇవే..

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో దాఖలైన పిటిషన్‌లో పలు కీలక డిమాండ్లను ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా పోర్టల్‌లో మార్పులు చేసిన ఫారమ్-6ను వెంటనే రద్దు చేసి, 1960 నాటి ఓటర్ల నమోదు నియమాల ప్రకారం ఉన్న అసలైన పాత ‘ఫారమ్ 6’ను పునరుద్ధరించాలని పిటిషనర్ కోరారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లేదా న్యాయ విచారణ కమిషన్‌తో సమగ్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం (RP Act) నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీశ్‌ గార్గ్‌, ఈసీఐ ఐటీ విభాగాధిపతి సీమా ఖన్నాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని , క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.

Gyanesh Kumar Supreme Court Plea | సర్వర్ లాగ్‌లు భద్రపరచాలని విజ్ఞప్తి..

క్షేత్రస్థాయి ఎన్నికల అధికారుల అధికారాలను కేంద్రీకృతం చేస్తూ సాఫ్ట్‌వేర్ ద్వారా ఓట్ల చేర్పులు, తొలగింపులను ప్రభావితం చేశారని పిటిషన్‌లో ఆరోపించారు. విచారణ నిమిత్తం ఈసీఐ నెట్‌వర్క్, ఈరోనెట్ (ERONet) సర్వర్ లాగ్‌లు, డేటాబేస్ వివరాలను సురక్షితంగా భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల కమిషనర్ల అంతర్గత అసమ్మతి నోట్లు బయటకు వచ్చిన వేళ దాఖలైన ఈ పిటిషన్‌తో దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: 3 Kg Tumour Surgery | వైద్య రంగంలో మిరాకిల్.. ఛాతీలో నుంచి భారీ ట్యూమర్ తొలగించిన డాక్టర్లు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *