Khairatabad Ganesh Immersion | గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా గణపతి

హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా, కోలాహలంగా సాగిన వినాయక నిమజ్జన మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Khairatabad Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో అత్యంత వైభవంగా, కోలాహలంగా సాగిన వినాయక నిమజ్జన మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. నగరవాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన ప్రసిద్ధ ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ట్యాంక్ బండ్‌పై ఉన్న క్రేన్ నెం.5 వద్ద ప్రశాంతంగా పూర్తయింది. భక్తుల జయధ్వానాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల నడుమ మహాగణపతికి అశేష భక్తజనం భావోద్వేగంతో వీడ్కోలు పలికారు.

Khairatabad Ganesh Immersion | అధికారుల సమన్వయంతో..

ఉదయం క్రేన్‌లో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపం కారణంగా శోభాయాత్ర ప్రారంభం కావడంలో కొంత జాప్యం జరిగింది. అయినప్పటికీ అధికారుల సమన్వయంతో నిర్ణీత సమయానికి టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మహా గణపతి విగ్రహం హుస్సేన్‌సాగర్ వద్దకు చేరుకుంది. బడా గణేషుడిని కడసారి కళ్లారా చూసేందుకు, నిమజ్జన వేడుకలో భాగం అయ్యేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో హుస్సేన్‌సాగర్ తీరం కిటకిటలాడింది.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా..

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు, మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల సమన్వయంతో పకడ్బందీ భద్రత మధ్య నిమజ్జన ఘట్టాన్ని పూర్తి చేశారు. నగరవ్యాప్తంగా సాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి..: Balapur Laddu Auction 2026 | బాలాపూర్ లడ్డూ రికార్డు ధర.. రూ. 39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *