అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Men’s Kabaddi | ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ ప్లేయర్లు అదరగొట్టారు. ఉదయం జరిగిన మ్యాచ్‌లో మహిళలు స్వర్ణం గెలుచుకోగా.. మధ్యాహ్నం జరిగిన ఫైనల్ పోరులో పురుషుల జట్టు సైతం పసిడి పతకం సాధించారు.
ఆసియా గేమ్స్ (Asian Games)లో ఇరాన్‌తో శనివారం మధ్యాహ్నం జరిగిన ఉత్కంఠ పోరులో భారత పురుషుల జట్టు ఘన విజయం సాధించింది. ఆది నుంచి ఇరు జట్లు హోరోహోరీగా తలపడ్డాయి. ఫస్ట్ హాప్ ముగిసే సమయానికి భారత్‌పై ఇరాన్ 18-17తో ఆధిక్యంలో నిలిచింది. విజిల్‌కు కొద్ది క్షణాల ముందు, అమీర్మొహమ్మద్ జఫర్దనేష్ చేసిన విజయవంతమైన ట్యాకిల్ ఇరాన్‌కు ఒక పాయింట్‌ను అందించింది. విరామం అనంతరం భారత్ పుంజుకుంది. ఇరాన్‌ను ఆలౌట్ చేయడంతో మూడు బోనస్ పాయింట్లు సాధించి 29-24 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం ఇరాన్‌ను 40-34 తేడాతో ఓడించి నాలుగో స్వర్ణ పతకాన్ని అందించడంతో పాటు తమ టైటిల్‌ను నిలబెట్టుకుంది.
India Men’s Kabaddi | నాలుగో సారి విజయం
గత నాలుగు ఆసియా క్రీడల ఫైనల్స్‌లో భారత్, ఇరాన్ మూడుసార్లు తలపడగా, ఆ మూడు మ్యాచ్‌లలోనూ భారతే విజయం సాధించింది. 2018 ఆసియా క్రీడల సెమీ-ఫైనల్లో ఇరాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. తాజాగా మరోసారి ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత ఖాతాలో నాలుగు స్వర్ణాలు చేరాయి. ఇప్పటి వరకు భారత్ మొత్తం 28 పతకాలు సాధించింది.
ఇది కూడా చదవండి..: India Women Kabaddi | పసిడి పట్టు.. కబడ్డీలో భారత్‌కు గోల్డ్ మెడల్