Jenda Jatara Nizamabad | భక్తిశ్రద్ధలతో జెండాకు పూజలు.. జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్​పాల్

నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శనివారం జెండా జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Jenda Jatara Nizamabad | నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శనివారం జెండా జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జాతరలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA Dhannpal Suryanarayana) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Jenda Jatara Nizamabad | ఏళ్లుగా ఇందూరులో జెండా పండుగ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందూరులో ఏళ్లుగా జెండా జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భాద్రపద మాసంలో వినాయకచవితికి ముందు జెండా జాతర ప్రారంభం అవుతుందన్నారు. జెండా ఆలయం నుంచి శోభాయాత్రగా పూలాంగ్ వరకు కొనసాగి, అక్కడ వారం రోజులపాటు ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ0 దర్శించుకొని వేంకటేశ్వర స్వామి కృపాకటక్షాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, మల్కాయి మహేందర్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  jenda 1 jenda1 jedna4

ఇది కూడా చదవండి: మోహన్​ బాబుతో పనిచేయడం నా లైఫ్​టైం అచీవ్​మెంట్​.. – ది ప్యారడైజ్​ డైరెక్టర్​ శ్రీకాంత్​ ఓదెల

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *