Asmita Cycling Competitions | క్రీడలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం : ఎంపీ అర్వింద్​

కేంద్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Asmita Cycling Competitions | కేంద్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని ఎంపీ అర్వింద్ (MP Arvind)​ పేర్కొన్నారు. ఖేలో ఇండియాలో భాగంగా రాష్ట్రస్థాయి అస్మిత సైక్లింగ్​ పోటీలను నగరంలోని (Nizamabad) బైపాస్​లో ఆదివారం  ప్రారంభించారు.

Asmita Cycling Competitions | జిల్లా నుంచే అత్యధిక రిజిస్ట్రేషన్లు..

జిల్లా సైక్లింగ్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను ప్రారంభించిన అర్వింద్​ అనంతరం మాట్లాడుతూ.. నిజామాబాద్​ జిల్లా నుంచి ఖేలో ఇండియాకు అత్యధికంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అభినందించదగ్గ విషయం అన్నారు. కేంద్రం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఆ ప్రోత్సాహంతోనే ఆసియా క్రీడల్లో భారత్​ తరపున క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా సైక్లింగ్​ సంఘం చేసిన ఏర్పాట్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, మేయర్​ ఉమారాణి, సైక్లింగ్​ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మల్లారెడ్డి, భూలోకం విజయ్​కాంత్​రావ్​,​ ఒలింపిక్​ సంఘం మాజీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈగ సంజీవ్​ రెడ్డి, బొబ్బిలి నర్సయ్య, సీనియర్​ న్యాయవాది రాజేందర్​ రెడ్డి, ప్రశాంత్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: వారు అంతరించిపోతున్నారు: ట్రంప్ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *