అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Alumni Reunion | పట్టణంలోని (Kamareddy) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) ఆదివారం సందడి నెలకొంది. 1982-85 బ్యాచ్నకు చెందిన ఫిషరీస్, ఫారెస్ట్ కోర్సుల పూర్వ విద్యార్థులు 40 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలుసుకున్నారు.
Kamareddy Alumni Reunion | మిని అల్యూమినీ పేరుతో..
మినీ అల్యూమినీ పేరుతో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, కళాశాల రోజుల ముచ్చట్లను గుర్తు చేసుకున్నారు. ఈ బ్యాచ్ కు చెందిన విద్యార్థులు ప్రస్తుతం పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, వ్యాపార, ఐటీ రంగాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. మరికొందరు ఉద్యోగ విరమణ పొందగా, పలువురు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి, సైంటిస్టు పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న కళాశాలలో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాము చదువుకున్న కళాశాల అభివృద్ధికి తమ వంతుగా ఆర్థిక సహాయం అందించి, కళాశాల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: IND vs WI తొలి వన్డే..కళ్లన్నీ రోహిత్–కోహ్లీపైనే..!