అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asian Games 2026 | ఆసియా క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారులు జోరు కొనసాగించారు. అథ్లెటిక్స్‌లో తృటిలో రెండు స్వర్ణాలు కోల్పోయినా.. 8వ రోజు భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి.
పురుషుల హైజంప్‌లో కుషారే సిల్వర్ మెడల్ సాధించాడు. చైనీస్ తైపీకి చెందిన ఫూ చావో-హసువాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. కుషారే గోల్డ్ మెడల్‌కు కావాల్సిన మార్కును సాధించినప్పటికీ, కౌంట్‌బ్యాక్ ఆధారంగా రెండో స్థానంలో నిలిచాడు. దీంతో సిల్వర్ మెడల్ దక్కింది. మరోవైపు లాంగ్‌జంప్‌లో ఎక్కువ భాగం ఆధిపత్యం చెలాయించినా.. ఆన్సీ సోజన్ సైతం సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. మహిళల 200 మీటర్ల రేసులో హరిత భద్ర, డెకాథ్లాన్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ కాంస్య పతకాలు సాధించారు.
Asian Games 2026 | పరుల్ చౌదరికి బ్రాంజ్
పరుల్ చౌదరి మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఆమె రేసు ఆది నుంచి మూడో స్థానంలో కొనసాగి చివరకు కాంస్య పతకం దక్కించుకుంది. అంతకు ముందు భారత్ స్క్వాష్‌లో రెండు రజత పతకాలు సాధించింది. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్, అనాహత్ సింగ్ సిల్వర్ మెడళ్లు సాధించారు. దీంతో ఆదివారం భారత్ మొత్తం ఏడు పతకాలు గెలుచుకుంది. ప్రస్తుతం ఇండియా ఖాతాలో మొత్తం 37 పతకాలు ఉన్నాయి. అందులో 4 బంగారు, 16 రజత పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అభినందనలు తెలిపారు.
DISTANCE, DETERMINATION, SILVER!
Ancy Sojan Edappilly secures the Silver Medal in the Women’s Long Jump at the #AsianGames2026.
Congratulations on a remarkable performance, Ancy!#Cheer4Bharat pic.twitter.com/Pll9WowGSi
— Kiren Rijiju (@KirenRijiju) September 27, 2026
దీనిని కూడా చదవండి : Indiramma Dheema Scheme | నవంబర్ 19 నుంచి ‘ఇందిరమ్మ ధీమా’ పథకం