అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Local Status | తెలంగాణ (Telangana)లో స్థానికతపై సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్థానిక రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో కనీసం నాలుగేళ్లు చదవాల్సిందేనని పేర్కొంది. దీనిపై రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Telangana Local Status | పిటిషన్ కొట్టివేత
స్థానికత అంశంపై బెల్లం అంకిత వేసిన పిటిషన్ను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం సోమవారం విచారించింది. స్థానికత కోసం నాలుగేళ్ల విద్యాభ్యాస నిబంధన ఏకపక్షంగా ఉందని పిటిషనర్ వాదించారు. అయితే ఆ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం తెలంగాణలో కనీసం నాలుగేళ్లు చదివిన వారే స్థానిక రిజర్వేషన్లకు అర్హులని స్పష్టం చేసింది. అంకిత పిటిషన్ను కొట్టి వేసింది. స్థానికతపై గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును న్యాయస్థానం గుర్తు చేసింది.
ఇది కూడా చదవండి..: Revanth Reddy Delhi Tour | ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి.. నామినేటెడ్ పోస్టులపై ఉత్కంఠ..!