అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asian Games Shooting | జపాన్‌లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పదో రోజు భారత్ షూటర్లు సత్తా చాటారు. మహిళా ట్రాప్ షూటింగ్ విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు.
భారత త్రయం నీరూ దండా (118), ఆషిమా అహ్లావత్ (106), మనీషా కీర్ (104) సంయుక్తంగా 328 స్కోరు చేశారు. దీంతో సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. అంతేగాకుండా నీరు ధండా 118 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదే విభాగంలో పురుషుల జట్టు పతకం సాధించలేకపోయింది. అయితే శపత్ భరద్వాజ్ వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత పొందాడు. తాజా సిల్వర్ మెడల్‌తో భారత్ పతకాల సంఖ్య 46కు చేరింది. ఇందులో 4 బంగారు, 21 సిల్వర్, 21 కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్లో భారత్ ఏకంగా 13 పతకాలు గెలిచింది.
Asian Games Shooting | అథ్లెటిక్స్‌లో..
ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ పోటీలు నేటితో ముగియనున్నాయి. పలువురు భారత క్రీడాకారులు పతకం కోసం పోటి పడుతున్నారు. గుల్వీర్ సింగ్, అవినాష్ సాబ్లే, గురిందర్‌వీర్ సింగ్, అనిమేష్ కుజుర్ హరిత భద్ర పతకాల వేటలో ముందున్నారు. అథ్లెటిక్స్‌లో భారత్ 19 పతకాలు సాధించింది. షూటింగ్లో రజతం సాధించిన మహిళా క్రీడాకారులను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా అభినందించారు.
SILVER ON TARGET FOR BHARAT!
Congratulations to Manisha Keer, Neeru & Aashima Ahlawat on securing the Silver Medal in the Women’s Trap Team event at the #AsianGames2026.
A special achievement for the trio, with Neeru & Aashima making their Asian Games debut.
Well done!… pic.twitter.com/TY9tg7mr1M
— Kiren Rijiju (@KirenRijiju) September 29, 2026
దీనిని కూడా చదవండి : Sep 29 Gold Prices | పసిడి ప్రియులకు అలెర్ట్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..