అక్షరటుడే, వెబ్డెస్క్ : Dasara Holidays | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) దసరా సెలవులపై ప్రకటన చేసింది. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఈ ఏడాది 13 రోజులు సెలవులు ఇచ్చింది.
ఈ ఏడాది అక్టోబర్ 20న దసరా పండుగ జరగనుంది. దీంతో ప్రభుత్వం పాఠశాలలకు అక్టోబర్ 10 (శనివారం) నుంచి 22 (గురువారం) వరకు సెలవులు ప్రకటించింది. 13 రోజుల పాటు పాఠశాలలు బంద్ ఉండనున్నాయి. అక్టోబర్ 23న బడులు తిరిగి ప్రారంభం అవుతాయి. పాఠశాలలతో పాటు కాలేజీలకు సైతం ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొననుంది.
ఇది కూడా చదవండి..: Train Accident | రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి