అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | సంభాల్ హింసాకాండ కేసులో ఎన్ఎస్ఏ చట్టం కింద నిందితుడిని నిర్భందించారు. దీనిని మంగళవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని సంభాల్‌లో షాహీ జామా మసీదు సర్వే నేపథ్యంలో 2024 నవంబర్ 24న హింస చెలరేగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 20 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారిగా ముల్లా అఫ్రోజ్‌ను గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో యూపీ ప్రభుత్వం అఫ్రోజ్‌ను 2025 అక్టోబర్‌లో కఠినమైన ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసింది.
Supreme Court | యూపీ ప్రభుత్వానికి ఫైన్
యూపీ ప్రభుత్వంపై అఫ్రోజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. నిందితుడి నేరాంగీకార వాంగ్మూలం ఆధారంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొంది. చట్టవిరుద్ధమైన నిర్బంధ ఉత్తర్వును జారీ చేసినందుకు ప్రభుత్వంపై రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఎన్ఎస్ఏ కింద అఫ్రోజ్ నిర్బంధాన్ని సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఇది కూడా చదవండి..: Divya Mittal Politics | ఐఏఎస్ వదిలి.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ లేడీ కలెక్టర్