క్రీడలుSunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా...

Sunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబాని

వాంఖడేలో పరుగుల వరద పారింది. రాన్ రికల్టన్ సెంచరీతో ముంబై భారీ స్కోరు సాధించినా, ట్రావిస్ హెడ్ – అభిషేక్ శర్మ జోడీ ధాటికి హైదరాబాద్ 244 లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి సంచలన విజయం నమోదు చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunrisers Batting | ముంబైలోనివాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పరుగుల సునామీ వచ్చింది. ముంబై ఇండియన్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఈ హై స్కోరింగ్ పోరు అభిమానులకు క్లాసిక్ థ్రిల్లర్‌ను తలపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిర్ణయం మొదట్లో పూర్తిగా సరైనదిగా కనిపించింది.

ఓపెనర్ రాన్ రికల్టన్ విరుచుకుపడి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రికల్టన్, ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అతని సుడిగాలి ఇన్నింగ్స్‌తో ముంబై 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Sunrisers Batting | క‌న్నీళ్లు పెట్టించారు…

స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షిస్తున్న నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ (Aakash ambani) తమ జట్టు ప్రదర్శనకు హర్షం వ్యక్తం చేశారు. ఈ భారీ స్కోరు చూసి ముంబై విజయంపై అందరూ నమ్మకం వ్యక్తం చేశారు. అయితే, 244 పరుగుల లక్ష్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లను ఏమాత్రం భయపెట్టలేదు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 76), అభిషేక్ శర్మ కలిసి ముంబై బౌలర్లపై దాడి చేశారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 92 పరుగులు నమోదు చేసి మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు. ప్రపంచ స్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ దాడిని అడ్డుకోలేకపోయాడు. తన నాలుగు ఓవర్లలో వికెట్ తీయకుండానే 54 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. ఈ సమయంలో కెప్టెన్ హార్దిక్​ పాండ్యా సహా ముంబై శిబిరంలో నిరాశ స్పష్టంగా కనిపించింది.

Sunrisers Batting

Sunrisers Batting | 65 పరుగులు చేసి అజేయంగా నిలిచిన క్లాసెన్

మధ్యలో గజన్‌ఫర్ రెండు వికెట్లు తీసి మ్యాచ్‌లో మళ్లీ ఉత్కంఠ రేకెత్తించినా, హెన్రిచ్ క్లాసెన్ ఆ ఆశలను చల్లార్చాడు. కేవలం 30 బంతుల్లో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచిన క్లాసెన్, నితీష్ రెడ్డితో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్, ఈ సీజన్‌లో తమ దూకుడు కొనసాగించింది.ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో దిగువ స్థానాల్లోనే కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో మెరుగుపడినప్పటికీ, బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబైకి ఇది మరో చేదు అనుభవంగా మారింది. అయితే ముంబై బౌలింగ్‌ని స‌న్‌రైజ‌ర్స్ చీల్చి చెండాడుతున్న క్ర‌మంలో నీతా అంబాని క‌న్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇది కూడా చదవండి..: SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hanumantha Rao Appointment | ప్రభుత్వ సలహాదారుగా వీహెచ్‌ నియామకం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hanumantha Rao Appointment | తెలంగాణ ప్రభుత్వ...

Trump Putin Talks | ఇరాన్‌కు రష్యా అండ.. యుద్ధం ముగింపుపై ట్రంప్ క్లారిటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Putin Talks | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

Shivadhar Reddy Farewell | డీజీపీ శివధర్​రెడ్డికి ఘనంగా వీడ్కోలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shivadhar Reddy Farewell | తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి...

AP 10th Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP 10th Results | ఆంధ్ర ప్రదేశ్​లో పదో...