అక్షరటుడే, ఇందూరు: Sign Language Day | జిల్లాలోని బధిరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం నిర్వహించారు.
Sign Language Day | బధిరులకు మేథోశక్తి మెండు..
ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. బధిరులకు మేథోశక్తి ఎంతో ఉంటుందన్నారు. సామాన్యులకు ధీటుగా పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. బధిరులుగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడటం సంతోషంగా ఉందన్నారు. లోపాన్ని పట్టించుకోకుండా తమపని తాము చేసుకుంటూ పోవాలని విజయం వరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహేష్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Employee Issues | ఉద్యోగుల సమస్యలు పరిష్కరానికి కృషి చేయాలి..