Pochampad Black Spot Inspection | రహదారిపై బ్లాక్​స్పాట్లను పరిశీలించిన కలెక్టర్​

తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రహదారులపై కలెక్టర్​ భవేష్​ మిశ్రా ప్రత్యేక దృష్టి పెట్టారు.

shashi kiran Mottala

అక్షరటుడే, పోచంపాడ్: Pochampad Black Spot Inspection | తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రహదారులపై కలెక్టర్​ భవేష్​ మిశ్రా (Collector Bhavesh Mishra) ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం మెండోరా మండలం పోచంపాడ్​ ఎక్స్ రోడ్​ను పరిశీలించారు.

Pochampad Black Spot Inspection | 44వ జాతీయ రహదారిపై..

44వ జాతీయ రహదారిపై పోచంపాడ్​ ఎక్స్ రోడ్డు వద్ద ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులు, స్థానిక ప్రజలతో కలెక్టర్ చర్చించారు. రహదారి దాటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఫ్లైఓవర్ లేదా అండర్‌పాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు పరిశీలించాలని కోరారు. అదే విధంగా హైస్పీడ్ వాహనాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, వేగ నియంత్రణ సూచిక బోర్డులు, స్పీడ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు పక్కన అనధికార పార్కింగ్‌ను నియంత్రించి, ప్రధాన రహదారిపై వాహనాలు నిలిపే ప్రాంతాలను తొలగించి ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని కోరారు.

Pochampad Black Spot Inspection | ట్రాఫిక్​ పాయింట్ల వద్ద..

ట్రాఫిక్ పాయింట్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, రాత్రివేళల్లో వీధి దీపాలు, రిఫ్లెక్టర్లు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద ప్రమాదాల నివారణకు తక్షణ భద్రతా చర్యలతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరారు.  ఆయన వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్​ మాల్వియా, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, తహశీల్దార్ శ్రీనివాస్, రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సైలు సుహాసిని పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: డిగ్రీ ఉందా ? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలి? 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *