అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asian Games Archery | ఆసియా క్రీడల్లో (Asian Games) బుధవారం భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభతో సత్తా చాటారు. ఆర్చరీలో రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.
మొదట కాంపౌండ్ మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణం గెలుచుకుంది. చైనాను చిత్తుగా ఓడించి తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పాటు, దక్షిణ కొరియా జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును భారత బృందం సమం చేసింది. అనంతరం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ సైతం మరో గోల్డ్ మెడల్ సాధించింది. అంతేగాకుండా లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించింది.
Asian Games Archery | ప్రపంచ రికార్డు..
ఆర్చరీ మహిళ విభాగం ఫైనల్లో భారత క్రీడాకారులు ఒక్కసారి కూడా ’10’ పాయింట్ల మార్కును తప్పించకుండా అద్భుతమైన ప్రదర్శన చేశారు. చికిత తనిపర్తి, ప్రితిక ప్రదీప్, జ్యోతి సురేఖ వెన్నం చైనాపై 238-234 తేడాతో గెలుపొందారు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును సమం చేశారు. అనంతరం మిక్స్డ్ కాంపౌడ్ ఆర్చరీ విభాగంలో సాహిల్ జాదవ్, చికిత్సా తానిపర్తి జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలు సాధించడంతో పాయింట్ల టేబుల్లో భారత్ టాప్ 10లోకి దూసుకొచ్చింది. పతకాలు గెలిచిన క్రీడాకారులను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా అభినందించారు. ప్రస్తుతం భారత ఖాతాలో 8 స్వర్ణాలు, 21 రజత, 25 కాంస్య పతకాలు ఉన్నాయి.
Asian Games Archery | ఇతర క్రీడల్లో..
ఇతర క్రీడల్లో సైతం భారత ఆటగాళ్లు సత్తా చాటారు. మహిళల టీమ్ స్క్వాష్‌లో తన్వి ఖన్నా, అనాహత్ సింగ్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించారు. దీంతో మరో పతకాన్ని ఖాయం చేశారు. సైక్లింగ్‌లో కీరిన్‌లో, సరితా కుమారి, కీర్తి రంగస్వామి చిక్కా హీట్స్ నుండి రెపెచేజ్ రౌండ్‌కు చేరుకున్నారు. సెపక్‌టక్రా పురుషుల జట్టు లావోస్‌ను 2-0 తేడాతో ఓడించింది.
ఇది కూడా చదవండి..: India Gold Medal | భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్