అక్షరటుడే, వెబ్‌డెస్క్: Drug Seizure | గుజరాత్ (Gujarat) ఏటీఎస్‌తో కలిసి భారత కోస్ట్ గార్డ్ నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ దొరికాయి. అరేబియా సముద్రంలో ఒక ఇరాన్ పడవ నుంచి రూ. 3 వేల కోట్లకు పైగా విలువైన 526 కిలోల మెథాంఫేటమిన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.
లక్షద్వీప్ సమీపంలో సెప్టెంబర్ 25న కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఓ పడవను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. అందులో ఐదుగురు పాకిస్తానీ జాతీయులను ఉన్నారు. లోపల తనిఖీ చేయగా భారీగా డ్రగ్స్ లభ్యం అయ్యాయి. స్వాధీనం చేసుకున్న సరుకులో నాణ్యమైన మెథాంఫేటమిన్, హెరాయిన్ ఉన్నాయని కోస్ట్ గార్డ్ తెలిపింది.
Drug Seizure | ముంబైకి తరలింపు
విచారణ, న్యాయపరమైన చర్యల కోసం ఆ పడవను, దానిలోని సిబ్బందిని ముంబైకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దేశంలో ఇటీవల డ్రగ్స్ దందా భారీగా పెరిగింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి భద్రతా సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారీగా డ్రగ్స్ లభ్యం కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి..: Ration Card Rules 2026 | రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఆ కార్డులు రద్దు..!