అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Government College | విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (Ali Shabbir) అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డు పనులను బుధవారం పరిశీలించారు.
Kamareddy Government College | ఇచ్చిన మాట ప్రకారం..
షబ్బీర్ అలీ 15 రోజుల క్రితం కళాశాలకు వచ్చినప్పుడు కళాశాలకు వెళ్లే దారికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రూ.12 లక్షలతో సీసీ రోడ్డు పనులు జరుగుతుండటంతో బుధవారం పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ 1,100 మంది అడ్మిషన్లతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. కళాశాలలో నూతన తరగతి గదుల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు. హాస్టళ్లలో కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామని, యూనిఫామ్స్, షూస్, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, కౌన్సిలర్లు హర్షిత, ప్రియాంక, వనిత పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Gold Chain Theft | కళ్లలో కారంచల్లి బంగారు గొలుసు చోరీ.. కామారెడ్డిలో ఘటన..