తెలంగాణShivadhar Reddy Farewell | డీజీపీ శివధర్​రెడ్డికి ఘనంగా వీడ్కోలు

Shivadhar Reddy Farewell | డీజీపీ శివధర్​రెడ్డికి ఘనంగా వీడ్కోలు

తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి నేడు పదవి విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఘనంగా వీడ్కోలు పరేడ్‌ను నిర్వహించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shivadhar Reddy Farewell | తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy) నేడు పదవి విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో సుదర్శన సెరిమోనియల్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ తెలంగాణ పోలీసులు ఘన వీడ్కోలు పరేడ్‌ను నిర్వహించారు.

శివధర్​రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసు దళానికి నాయకత్వం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవం అన్నారు. ఇది అత్యంత ప్రగతిశీలమైన, సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉన్న పోలీసు దళం అన్నారు. ఇటువంటి దళానికి నాయకత్వం వహించడం తనకు గర్వంగా ఉందన్నారు. డీజీపీగా ఆయన ఏడు నెలలు సేవలు అందించారు. గత ఏడు నెలల కాలం నాకు అత్యంత చిరస్మరణీయంగా నిలిచిందని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Shivadhar Reddy Farewell | అనేక మార్పులు

తాను 32 ఏళ్ల క్రితం పోలీసు ఉద్యోగం చేరానని శివధర్​రెడ్డి అన్నారు. అప్పటికి.. ఇప్పటికి పోలిసింగ్​లో చాలా మార్పులు వచ్చాయన్నారు. యువ అధికారులందరూ తమ భవిష్యత్ ప్రయత్నాలలో గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు. పోలీసులు, ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం అమలు చేశామన్నారు.

Shivadhar Reddy Farewell | మావోయిజం నిర్మూలనలో..

తెలంగాణ నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్​ మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ పోలీసులు (Telangana Police) అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను ముందుకు తీసుకు వెళ్తానన్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో మావోయిజం ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, మనం కూడా మన కార్యకలాపాల ప్రాధాన్యతలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీజీపీ శివధర్​రెడ్డి మావోయిజం నిర్మూలనలో కీలకంగా వ్యవహరించారని సీవీ ఆనంద్ (C.V. Anand) అన్నారు. ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల సరెండర్‌లో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. భారత ప్రభుత్వ తీవ్ర కృషి ఫలితంగా దేశవ్యాప్తంగా నక్సలిజం దాదాపు అంతిమ దశకు చేరుకున్నట్లు కనిపిస్తోందన్నారు.

ఇది కూడా చదవండి..: Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nepal Airlines Map | తప్పుడు మ్యాప్‌ వివాదం.. తలవంచిన నేపాల్ ఎయిర్‌లైన్స్!

అక్షరటుడే, న్యూదిల్లీ: Nepal Airlines Map | భారత భూభాగమైన జమ్మూకశ్మీర్‌ను...

MMTS Free Travel | హైదరాబాదీల‌కు గుడ్ న్యూస్.. ఎంవోయూ రెడీ, ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం ఎప్పటి నుండో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: MMTS Free Travel | హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్...

Gandhi Bhavan | గాంధీ భవన్ ఎదుట ఉద్యమకారుల ఆందోళన

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gandhi Bhavan | హైదరాబాద్ (Hyderabad)​లోని గాంధీ భవన్​...

Kavitha TRS Party | కవిత టీఆర్​ఎస్​కు ఎన్నికల సంఘం ఆమోదం.. పార్టీ పేరులో చిన్న మార్పు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha TRS Party | కల్వకుంట్ల కవిత (Kalvakuntla...