CEC House Attack | సీఈసీ పూర్వీకుల ఇంటిపై నల్లరంగుతో రాతలు.. ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు

అరెస్టయిన వారిని విచారిస్తున్నామని, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: CEC House Attack | ఉత్తర్​ప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పూర్వీకుల ఇంటి వద్ద నిరసన సందర్భంగా విధ్వంసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

CEC House Attack | భద్రత కట్టుదిట్టం

ఆగ్రా Agra లోని సీఈసీ పూర్వీకుల ఇంటి వద్ద నిరసన చేపట్టిన సమయంలో కొందరు వ్యక్తులు ఇంటి గోడలపై నల్లరంగుతో రాతలు రాయడంతో పాటు ఆస్తికి నష్టం కలిగించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ACB Raid | ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్​ ఆఫీసర్​

నిందితులపై హత్యాయత్నం, అల్లర్లు తదితర అభియోగాలతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరెస్టయిన వారిని విచారిస్తున్నామని, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో సీఈసీ కుటుంబానికి చెందిన ఆస్తి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *