అక్షరటుడే వెబ్‌డెస్క్: Erravelli Land Survey | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఫామ్‌హౌస్ ఉన్న సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి (Erravelli) గ్రామ భూ సర్వే నివేదిక పూర్తియింది. రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖల నుంచి అందిన ఈ సమగ్ర రిపోర్టును జిల్లా కలెక్టర్ హైమావతి ఇవాళ అధికారికంగా ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నివేదికలో ఏయే అంశాలు వెల్లడవుతాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Erravelli Land Survey | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ..
ఇదివరకు అసెంబ్లీ వేదికగా సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల పరిధిలోని భూముల లెక్కలను తేల్చాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి ప్రభుత్వ భూముల్లో ఈ సర్వే చేపట్టారు.
Erravelli Land Survey | భారీ బందోబస్తుతో సర్వే పూర్తి..
ఎర్రవల్లి శివారులోని సర్వే నంబర్ 325లో ఉన్న 388 ఎకరాలు, అలాగే వెలికట్ట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 271లో అధికారులు భారీ బందోబస్తు నడుమ ఈ సర్వేను నిర్వహించారు. సర్వే నంబర్ 325లో 244 మంది అనుభవదారులకు, వెలికట్టలోని సర్వే నంబర్ 271లో 118 మంది అనుభవదారులకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి, ఆయా భూముల్లో పొజిషన్ సర్వే పూర్తి చేశారు.
Erravelli Land Survey | వ్యక్తమవుతున్న అభ్యంతరాలు..
అయితే, ఈ సర్వే ప్రక్రియలో ఎర్రవల్లి శివారులోని వెంకటాపూర్ గ్రామస్థులు లేవనెత్తిన అభ్యంతరాలు, విజ్ఞప్తులను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కలెక్టర్ ప్రభుత్వానికి అందజేయనున్న ఈ నివేదిక ఆధారంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: India vs Sri Lanka | హాఫ్ సెంచరీతో రాణించిన ఇషాన్.. శ్రీలంక టార్గెట్ 170