అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tandur Boxing Student | జిల్లాస్థాయి బాక్సింగ్ క్రీడలో ప్రతిభ కనబరిచిన జడ్పీహెచ్‌ఎస్ తాండూర్ పాఠశాల విద్యార్థి అఖిల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు పాఠశాల ప్రతినిధులు వివరాలు వెల్లడించారు.
Tandur Boxing Student | నాగిరెడ్డిపేట మండలం..
నాగిరెడ్డిపేట మండలం (Nagireddypet Mandal)లోని తాండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అఖిల్ 55 కేజీల బాక్సింగ్ విభాగంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటుకుని రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు కె. స్వప్న, ఎంఈవో వెంకట్‌రెడ్డి విద్యార్థి అఖిల్‌ను అభినందించారు. క్రీడల్లో పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేస్తూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి..: Finance Representatives Attack | ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులపై దాడి.. ఇద్దరి అరెస్టు