అక్షరటుడే, వెబ్‌డెస్క్: India vs Sri Lanka | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించింది.శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పిచ్ కఠినంగా ఉండటంతో భారత బ్యాటర్లు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. వైభవ్ సూర్యవంశీ 38, ఇషాన్ కిషన్ 80 పరుగులతో రాణించడంతో భారత్ 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 45 పరుగులకే ఆలౌట్ అయింది.
India vs Sri Lanka | ఐదుగురు డకౌట్
భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మన్ విలవిలలాడారు. పరుగుల ఖాతా ఓపెన్ చేయకుండానే లంక జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ బుమ్రా తొలి ఓవర్లోనే ఇద్దరిని ఔట్ చేశాడు. అనంతరం ఏ దశలోనూ శ్రీలంక కోలుకోలేకపోయింది. పరుగులు చేయడానికి బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆ జట్టు 45 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 124 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.
India vs Sri Lanka | దాయాదితో పసిడి పోరు
మరో సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. దీంతో ఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది. పసిడి కోసం ఈ మ్యాచ్ శనివారం జరగనుంది. దీంట్లో గెలిస్తే భారత్ పసిడి పతకం గెలుచుకుంటుంది. ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ సాధించింది.
ఇది కూడా చదవండి..: India vs Sri Lanka | హాఫ్ సెంచరీతో రాణించిన ఇషాన్.. శ్రీలంక టార్గెట్ 170