అక్షరటుడే వెబ్‌డెస్క్: Danam Nagender Votes | నగరంలో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశంపై మాజీ మంత్రి దానం నాగేందర్ ఎన్నికల కమిషన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిమాయత్ నగర్ డివిజన్‌లో సీసీ రోడ్ల పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ తన వైఖరి మార్చుకోకపోతే ఈసీ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరాన్ని తగలబెడతామని తీవ్రమైన హెచ్చరికలు చేశారు.
Danam Nagender Votes | బీజేపీతో ఈసీ కుమ్మక్కు..
ఎన్నికల కమిషన్ అధికారులు బీజేపీతో కుమ్మక్కై వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దానం ఆరోపించారు. కేవలం హిమాయత్ నగర్ డివిజన్‌లోనే దాదాపు 20 వేల ఓట్లను ఏకపక్షంగా తొలగించారని మండిపడ్డారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నాయకులు వ్యవస్థీకృతమైన ‘ఓట్ చోరీ’కి పాల్పడుతున్నారని విమర్శించారు. తన నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరి ఓటును కాపాడుకునే పూర్తి బాధ్యత తనపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా స్థానికంగా ఉంటున్న ప్రజల ఓట్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Danam Nagender Votes | తక్షణమే ఓట్లను పునరుద్ధరించాలి..
ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి, తొలగించిన ఓట్లను యథావిధిగా పునరుద్ధరించాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ నిరసనలు, పోరాటాలు మరింత ఉధృతంగా ఉంటాయని, ఈసీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
‘Vote Chori’: Danam Nagender alleges 20,000 votes removed in his division, threatens action
Former Khairatabad MLA Danam Nagender has warned of serious consequences if the Election Commission does not change its approach towards deletion of voters from electoral rolls.
“If the… pic.twitter.com/34mVklxhwM
— Sudhakar Udumula (@sudhakarudumula) October 1, 2026
ఇది కూడా చదవండి: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: షబ్బీర్ అలీ