Pilot Smith Machar | పైలట్ స్మిత్ మచ్చర్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ

పైలట్​ స్మిత్ మచ్చర్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం ఫోన్​లో మాట్లాడారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pilot Smith Machar | ఫ్లై దుబాయి ఫ్లైట్​లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన పైలట్​ స్మిత్ మచ్చర్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం ఫోన్​లో మాట్లాడారు. కో పైలట్​ దాడిలో మచ్చర్​ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన అబుదాబి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎన్నో ప్రాణాలను కాపాడటంలో కెప్టెన్ చూపిన ధైర్యాన్ని ప్రధానమంత్రి (PM Modi) ప్రశంసించి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. కో పైలట్ తనపై ఎలా దాడి చేశాడో ప్రధానికి పైలట్ మచ్చర్ వివరించారు. మచ్చర్ ఈ వీడియో కాల్ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. ఆ సంఘటన జరిగినప్పుడు తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను వివరించారు.

Pilot Smith Machar | హనుమాన్​ చాలీసా పఠించా..

తాను ధైర్యం చూపకపోతే, 170 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతారని ఆ సమయంలో తాను గ్రహించానని మచ్చర్​ మోదీతో అన్నారు. ఆ కఠిన సమయంలో తాను హనుమాన్ చాలీసా పఠించానని ఆయన చెప్పారు. హనుమంతుడే తనకు ధైర్యాన్నిచ్చాడు అని పేర్కొన్నారు. మచ్చర్​తో పాటు ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Vijay Conductor | కండక్టర్‌గా సీఎం విజయ్ సడన్‌ ఎంట్రీ.. ఆశ్చర్యంలో ప్రయాణికులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *