Journalist Protection Law | జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) నాయకులు డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Journalist Protection Law | జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్​లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.

Journalist Protection Law | దశాబ్దాలుగా పోరాటం..

జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి. రజనీకాంత్, టి. రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగుతోందన్నారు. సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. మీడియా రంగంలో పనిచేస్తున్న విలేకరుల రక్షణకు ప్రత్యేక చట్టాలు లేకపోవడం విచారకరమన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భద్రత కోసం ప్రత్యేక జాతీయ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.

రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులకు నూతన వెజ్​బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఉచిత, నాణ్యమైన వైద్యం కోసం క్యాష్ లెస్ హెల్త్​ కార్డులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Gandhi Jayanti | బాపూఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్, సీఎం రేవంత్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *