E-Cigarette Seized | వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​ ద్వారా ఇ–సిగరెట్ల విక్రయం

ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​ ద్వారా ఇ–సిగరెట్ల విక్రయం చేపడుతున్న దుకాణాలపై ఈగల్​ ఫోర్స్​ దాడులు చేపట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : E-Cigarette Seized | యువతను లక్ష్యంగా చేసుకొని వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​ ద్వారా ఇ–సిగరెట్లు (వేప్స్​) విక్రయిస్తున్న దుకాణాలపై ఈగిల్​ ఫోర్స్ (Eagle Force)​ దాడులు చేపట్టింది. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

మాదాపూర్‌ (Madhapur)లోని స్మోకిన్ స్పాట్, కావేరీ హిల్స్‌లోని హోలీ స్మోక్ అనే రెండు దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. 92 నిషేధిత వేప్‌లు, 15 ప్యాకెట్ల విదేశీ సిగరెట్లు, రెండు స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. హోలీ స్మోక్​ నిర్వాహకులు అబ్దుల్ రషీద్ పి.ఎం, చియాబుద్దీన్ కేరళ నుంచి వేప్​లను నగరానికి తెచ్చేవారు. వాట్సాప్​ ద్వారా వాటి గురించి ప్రచారం చేసి విక్రయించేవారు.

E-Cigarette Seized | రాపిడో ద్వారా ఇంటికే డెలివరీ

స్మోకిన్​ స్పాట్ నిర్వాహకులు ఏకంగా వాట్సాప్​ గ్రూప్​ ఏర్పాటు చేశారు. ఇందులో 79 మంది సభ్యులు ఉన్నారు. ఇన్​స్టాగ్రామ్​లో సైతం వీరు అకౌంట్​ నడుపుతూ.. వేప్​ల విక్రయం చేపడుతున్నారు. అంతేగాకుండా కస్టమర్లకు వీరు నిషేధిత ఇ సిగరెట్లను రాపిడో, పోర్టర్ వంటి డెలివరీ సేవల ద్వారా ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దుకాణం యజమాని మహమ్మద్ హనీఫ్ ఉజర్ మొయిదీన్ ప్రస్తుతం కేరళలో ఉన్నాడు. ఉద్యోగులు అబ్దుల్ అర్షద్ కె.ఎం, మహమ్మద్ ఆదిల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. రెండు దుకాణాలపై దాడులు చేసిన అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Women’s Hockey | మహిళల హాకీలో భారత్‌కు గోల్డ్‌ మెడల్‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.