అక్షరటుడే, వెబ్డెస్క్: India Pakistan Final | ఆసియా క్రీడల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని చిత్తు చేసి పసిడి పతకం గెలుచుకుంది.
ఆసియా గేమ్స్ (Asian Games) ఫైనల్లో భారత్, పాక్ తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ 61, తిలక్ వర్మ 51, శివమ్ దూబే 27, శ్రేయాస్ అయ్యర్ 21, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది.
India Pakistan Final | నవాజ్ ఒంటరి పోరాటం
పాక్ జట్టు 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఫర్హాన్ 10 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. మాజ్ 23, ఆయూబ్ 27 పరుగులు చేశారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. పాక్ బ్యాటర్ హసన్ నవాజ్ ఒంటరి పోరాటం చేశాడు. 51 బంతుల్లో 96 పరుగులు చేశాడు. అయితే మిగతా బ్యాట్స్మెన్ విఫలం కావడంతో పాక్ లక్ష్యం ఛేదించలేకపోయింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో పాక్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది.
ఇది కూడా చదవండి..: India Pakistan Final | పాక్తో ఫైనల్ పోరు.. భారత్ భారీ స్కోరు