అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SIR Voter List Nizamabad | జిల్లాలో (Nizamabad) అర్హులందరికి ఓటుహక్కు ఉండేలా తుది ఓటరు జాబితా రూపకల్పనకు (SIR Process) కృషి చేయాలని ఎన్నికల జాబితా పరిశీలకులు, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా( Telangana Elections), పట్టణ ప్రణాళికా విభాగం సంచాలకులు టీకే శ్రీదేవి సూచించారు. ఆర్మూర్‌లో ఎస్ఐఆర్ పనితీరును శనివారం పరిశీలించారు.
SIR Voter List Nizamabad | ఆర్మూర్‌లో ప్రత్యక్ష పరిశీలన..
ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ లహరి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాలతో కలిసి ఆర్మూర్(Armoor) నియోజకవర్గం పరిధిలోని మామిడిపల్లిలో 39వ పోలింగ్ స్టేషన్‌ను, ఆర్మూర్‌లోని 88వ పోలింగ్ కేంద్రాలను శ్రీదేవి పరిశీలించారు. ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎన్ని హియరింగ్‌లు పూర్తయ్యాయి.. అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతర కలెక్టరేట్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారులతో సమావేశమయ్యారు. ఒక్కో నియోజకవర్గం వారీగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరుతెన్నుల గురించి ఈఆర్వోలను అడిగి తెలుసుకున్నారు.
హియరింగ్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో బీఎల్వోల పనితీరును పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఈఆర్వోలకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, బాన్సువాడ ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రవీందర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్వోలు, సంబంధిత శాఖల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నే తొలిసారిగా కలగన్న సాంగ్..మోహన ఎంత క్యూట్ గా పాడిందో..