Kusum Group Ukraine | ఉక్రెయిన్​లో భారత కంపెనీపై రష్యా డ్రోన్​ దాడి

ఉక్రెయిన్‌లో భారత్​కు చెందిన ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్లు దాడి చేశాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kusum Group Ukraine | ఉక్రెయిన్‌లో భారత్​కు చెందిన కుసుమ్ గ్రూప్‌కు సంబంధించిన భారీ ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్లు దాడి (Drone Attack) చేశాయి. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు.

ఈ దాడిలో ఉక్రెయిన్‌లోని సుమీలో ఉన్న ఈ ఫార్మా ప్లాంట్ ప్రధాన నిర్మాణం చాలా వరకు ధ్వంసమైంది. మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కుసుమ్ గ్రూప్ 1994లో ఉక్రెయిన్‌కు భారతీయ మందులను ఎగుమతి చేసే పంపిణీదారుగా ప్రారంభమైంది. ప్రస్తుతం దీనిని రాజీవ్ గుప్తా నడుపుతున్నారు. 2002లో ఇతర కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసి, తన సొంత బ్రాండ్‌లను మార్కెటింగ్ చేయడం ప్రారంభించింది.

Kusum Group Ukraine | 2009లో ఏర్పాటు

ఈ కంపెనీ 2009లో ఉక్రెయిన్​లో ప్లాంట్లను ప్రారంభించింది. 50కి పైగా జెనరిక్ ఉత్పత్తులను తయారు చేసి, వాటిని ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్‌తో సహా తొమ్మిదికి పైగా దేశాలలో విక్రయిస్తుంది. తాజాగా ప్లాంట్​పై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఖండించారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ దాడిలో రూ.400 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Khairatabad by-election | ఓటమి భయంతోనే సీఎం కోర్టుకెళ్లారు : డీకే అరుణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *