Nizamabad Red Cross Counting | ఉత్కంఠగా కొనసాగుతున్న రెడ్​క్రాస్​ ఎన్నికల కౌంటింగ్​

నిజామాబాద్​ జిల్లా రెడ్​క్రాస్​ సొసైటీ మేనేజింగ్​ కమిటీ ఎన్నికల కౌంటింగ్​ ఉత్కంఠగా మారింది.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Nizamabad Red Cross Counting | జిల్లా (Nizamabad) రెడ్​క్రాస్​ సొసైటీ మేనేజింగ్​ కమిటీ ఎన్నికల కౌంటింగ్​ ఉత్కంఠగా కొనసాగుతోంది. నగరంంలోని హరిచరణ్​ మార్వాడీ విద్యాలయంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్​ మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది.

Nizamabad Red Cross Counting | పోలైన ఓట్లు..1,552

రెడ్​క్రాస్​ సొసైటీలో మొత్తంగా 9,823మందికి ఓటింగ్​ అవకాశం ఉండగా.. మధ్యాహ్నం పోలింగ్​ సమయం ముగిసేనాటికి 1552 ఓట్లు పోలయ్యాయి. ఈసారి రెడ్​క్రాస్​ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. 29మంది అభ్యర్థులు రెండు ప్యానెళ్లుగా విడిపోయి ప్రచారం చేశారు. రాత్రి 8గంటల వరకు కూడా కౌంటింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు, వారి మద్దతుదారులు హరిచరణ్​ మార్వాడీ విద్యాలయం ఎదుట ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: దసరా బరిలో 6 సినిమాలు.. విన్నర్ ఎవరో? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *