BC Rights | బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు : పీసీసీ చీఫ్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Rights | పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్  గౌడ్ (Mahesh Goud)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు అన్నారు. మోదీ (PM Modi), అమిత్ షా దగ్గరికి వెళ్ళి చెప్పే దమ్ము ధైర్యం వాళ్లకు లేదని విమర్శించారు.

ఓబీసీ సింహగర్జన సమావేశంలో పీసీసీ చీఫ్​ మాట్లాడారు. బీసీల హక్కుల కోసం మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీ తమకు ఇచ్చారన్నారు. బీసీలకు రావాల్సిన వాటా తీసుకుంటాన్నారు. అవసరం అయితే లాక్కుంటామని పేర్కొన్నారు. కేంద్ర సర్వేలో పదో కాలంలో ఎస్సీ,ఎస్టీ ఇచ్చి ఓబీసీ కాలం ఎత్తేశారని ఆయన తెలిపారు. దీంతో బీసీలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

BC Rights | బీసీలు ఏకం కావాలి

రాష్ట్రంలో 55 శాతానికి సర్పంచులను బీసీలను చేశామని పీసీసీ చీఫ్​ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం బీసీలకు సీట్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్​ అన్నారు. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను మరింత పెంచుతామని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. కులాలను పక్కనపెట్టి బీసీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్​ తరాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

దీనిని కూడా చదవండి : Nandipalli Auto Accident | ఆస్పత్రికి వెళ్తుంటే ఆటో బోల్తా.. యువకుడి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *