Telangana Municipal Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్.. త్వరలో మున్సిపల్​ శాఖలో 886 పోస్టుల భర్తీ

మున్సిపల్​ శాఖలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Municipal Jobs | రాష్ట్రంలో జాబ్​ నోటిఫికేషన్​ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పనుంది. మున్సిపల్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్​ విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది.

తెలంగాణ (Telangana)లో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి (MA&UD) శాఖ పరిధిలో వార్డు అధికారులు (Ward Officers) నుంచి గ్రేడ్-2, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ల వరకు మొత్తం 886 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2027 జనవరిలో తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ (TGPSC) ద్వారా నోటిఫికేషన్​ వెలువడే అవకాశం ఉంది.

Telangana Municipal Jobs | పోస్టుల వివరాలు

ప్రభుత్వం భర్తీ చేయనున్న పోస్టుల్లో గ్రేడ్​ –3 కమిషనర్​ పోస్టులు 20, 11 డిప్యూటీ కమిషనర్​, 86 జూనియర్ అసిస్టెంట్​, 56 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్​, 40 హెల్త్ అసిస్టెంట్​, 40 జూనియర్ అకౌంటెంట్​, 40 సీనియర్ అకౌంటెంట్​ పోస్టులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా పలు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. వాటిలో సిబ్బంది కొరత నెలకొంది. దీంతో డిప్యుటేషన్లతో నెట్టుకొస్తున్నారు. పోస్టులను భర్తీ చేస్తే ఆయా బల్దియాల్లో సిబ్బంది కొరత తీరనుంది.

ఇదికూడాచదవండి: BC Chief Minister | తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి: పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *