అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medipally Jewellery Robbery | మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని మేడిపల్లి (Medipally)లో భారీ చోరీ జరిగింది. క్యారట్‌లేన్ డైమండ్స్ జువెల్లరీ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు రూ.2కోట్లకుపైగా విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
క్యారట్‌లేన్ డైమండ్స్ నగల దుకాణం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉంది. దొంగలు షట్టర్‌ను వంచి లోనికి ప్రవేశించారు. అనంతరం గాజు డిస్ప్లే కేసులను పగలగొట్టి వజ్రాల ఆభరణాలను తీసుకుపోయారు. అపహరణకు గురైన ఆభరణాల కచ్చితమైన విలువ ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. అయితే రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
Medipally Jewellery Robbery | కేసు నమోదు
నగల దుకాణం షట్టర్ తెరిసి ఉందని స్థానికులు గమనించి నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసులు దుకాణానికి చేరుకుని ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. ఒక క్లూస్ బృందం కూడా సంఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించింది. నిందితులు దుకాణానికి ఎలా చేరుకున్నారు, దోపిడీ తర్వాత ఏ మార్గంలో వెళ్లారు అనే విషయాలను నిర్ధారించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Balapur Fire Accident | బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం