అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Praja Vani Complaints | ప్రజావాణి (Prajavani)లో ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు అధికారులకు సూచించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Praja Vani Complaints | ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి..
ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 107 ఫిర్యాదులు అందాయని వివరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్ రావు, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్లు స్వీకరించారు.
Praja Vani Complaints | ఆర్టీఐ చట్టంపై విస్తృతస్థాయిలో అవగాహన..
సమాచార హక్కు చట్టం వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. ప్రజావాణి అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈనెల 5 నుండి 12వ తేదీ వరకు ఆర్టీఐ వారోత్సవాలను అన్ని స్థాయిలలో నిర్వహిస్తూ, సమాచార హక్కు చట్టం పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Rice Prices Rise | బియ్యం ధరలకు రెక్కలు.. సామాన్యులకు చుక్కలు