ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ పంచాయతీ కార్యదర్శి అరుణ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా (Siddipet District)లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బి. అరుణ పని చేస్తున్నారు. గ్రామంలోని ఓ వ్యక్తి రెండు ఇళ్లకు చెందిన మ్యుటేషన్ దరఖాస్తును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపడానికి ఆమె రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.15 వేలకు తగ్గించారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ACB Trap | కారోబార్​ సాయంతో..

జీపీ కార్యదర్శి అరుణ మంగళవారం ఉదయం కారోబర్​ దాసరి సంతోష్​ సాయంతో లంచం తీసుకుంది. ఫిర్యాదుదారు రూ.15 వేలు కారోబార్​కు ఇవ్వగా, అతడు ఆ మొత్తాన్ని అరుణకు అందించాడు. ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా రాష్ట్రంలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణం, మ్యూటేషన్​ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి సైతం వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Bank Five Day Week | బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి: కల్వకుంట్ల కవిత 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *