ORR Tipper Accident | రింగ్​రోడ్డుపై ఘోర ప్రమాదం.. టిప్పర్​ డ్రైవర్​ మృతి

హైదరాబాద్​ ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ORR Tipper Accident | హైదరాబాద్ (Hyderabad)​ ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ టిప్పర్​ డ్రైవర్​ మృతి చెందగా.. క్లీనర్​ తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఓఆర్​ఆర్​పై వట్టినాగులపల్లి సమీపంలోని ముందు వెళ్తున్న టిప్పర్ లారీని మరో టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో టిప్పర్​ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అందులోని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. క్లీనర్​కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.

ORR Tipper Accident | భారీగా ట్రాఫిక్​ జామ్

ఈ ప్రమాదం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించేందుకు పోలీసులు, అధికారులు క్రేన్‌ను ఉపయోగించడంతో 3, 4వ లేన్‌లను మూసివేయాల్సి వచ్చింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : ACB case | మెడికల్​ లీవ్​ల కోసం లంచం.. సీనియర్​ అకౌంటెంట్​పై ఏసీబీ కేసు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *