Social Boycott Complaints | సామాజిక బహిష్కరణలపై బీసీ కమిషన్​కు ఫిర్యాదులు

సామాజిక బహిష్కరణకు గురైన బాధితులతో బీసీ కమిషన్​ భేటీ అయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Social Boycott Complaints | సామాజిక బహిష్కరణ ఉదంతాలపై రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్​కు ఇటీవల ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బాలలక్ష్మిలతో కూడిన బృందం బుధవారం జిల్లా (Nizamabad)కు విచ్చేసింది.

Social Boycott Complaints | కలెక్టేరట్​ ప్రాంగణంలో..

కమిషన్​ సభ్యులు కలెక్టరేలో బాధితులతో భేటీ అయ్యారు. ఐడీవోసీకి చేరుకున్న కమిషన్ ప్రతినిధులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు తదితరులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంఘిక, కుల బహిష్కరణలకు గురైన బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కమిషన్ ఛైర్మన్, సభ్యులకు లిఖితపూర్వకంగా విజ్ఞాపనలు సమర్పించారు. బాధితులు భయం లేకుండా, స్వేచ్ఛగా వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు.

Social Boycott Complaints | తరలివచ్చిన ఫిర్యాదుదారులు..

దీంతో జిల్లాలోని ఆయా ప్రాంతాలలో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట కొనసాగుతున్న అరాచకాల గురించి, సామాజిక బహిష్కరణ ఘటనలను బాధితులు కమిషన్​కు ఏకరువు పెట్టారు. బీసీ కుల సంఘాల నాయకులు, వివిధ వర్గాల వారు, ప్రజా సంఘాల ప్రతినిధులు సైతం హాజరై రాతపూర్వకంగా వినతి పత్రాలను కమిషన్​కు అందిస్తూ, మౌఖికంగా కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఇది కూడా చదవండి..: Nandipet Bus Services | సమయానికి రాని బస్సులు.. ప్రయాణికులకు ఇబ్బందులు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *