Train Fire Accident | రైలులో అగ్ని ప్రమాదం

బీబీనగర్ సమీపంలో సిర్‌పూర్-కాగజ్‌నగర్ రైలులో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Train Fire Accident | రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)లోని బీబీనగర్ సమీపంలో సిర్‌పూర్-కాగజ్‌నగర్ రైలులో బుధవారం ఈ ప్రమాదం జరిగింది.

బ్రేక్ లైనర్ చక్రానికి తగలడంతో మంటలు, పొగ వ్యాపించాయి. కో-పైలట్ ఈ సమస్యను గమనించి లోకో పైలట్‌కు తెలియజేయగా, ఆయన రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ఆగగానే వెంటనే కిందకు దిగిపోయారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Bandi Sanjay Comments | ఓట్, సీట్ చోరీకి పాల్పడిన ఏకైక పార్టీ కాంగ్రెసే : బండి సంజయ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *