Golden Hour Road Accidents | గోల్డెన్ అవర్‌లో స్పందించి రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడాలి

గోల్డెన్ అవర్‌లో స్పందించి రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Golden Hour Road Accidents | గోల్డెన్ అవర్‌లో స్పందించి రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నిజామాబాదు పోలీస్ శాఖ సౌజన్యంతో సేవ్ లైఫ్ ఫౌండేషన్, వెర్టీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోపోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్​లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Golden Hour Road Accidents | తక్షణ సాయం అందించాలి..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించి, గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తరలించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడగలమని సీపీ పేర్కొన్నారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్, వెర్టీస్ ఫౌండేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించడం , ప్రమాదంలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం చేయాలన్నారు. 108, ఇతర అంబులెన్స్ సేవలకు సమాచారం అందించడం వంటి చర్యలను వేగంగా చేపట్టాలని అన్నారు. అదేవిధంగా , తీవ్ర ప్రమాదాల్లో వాహనాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసుకురావడానికి ఫైర్ సర్వీస్ సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు. 108 అంబులెన్స్ సిబ్బంది అత్యవసర వైద్య సేవలు అందిస్తూ బాధితులను త్వరితగతిన ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

Golden Hour Road Accidents | ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స..

ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యసిబ్బంది కూడా రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ప్రమాద బాధితుడు ఆస్పత్రికి చేరుకునే సమయాన్ని తగ్గించేందుకు పోలీస్ శాఖ–108–ఫైర్ సర్వీస్–అంబులెన్స్–ఆస్పత్రుల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని సూచించారు. ప్రతి నిమిషం ఒక ప్రాణాన్ని కాపాడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు ఆదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సేవ్ లైఫ్ ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ మహేష్, సీఈవో ప్యూష్ తివారి, మేనేజర్ నూర్ కేథర్ పాల్, సీవోపీ ఇలియానా, అసోసియేటెడ్ డైరెక్టర్ మల్లికార్జున్, సీవోసీ పుష్పందర్ కౌశిక్, డీటీవో రమేష్ రాథోడ్, డీఎఫ్​వో పరమేశ్వర్, 108 డైరెక్టర్ డాక్టర్ స్వరాజ్, డీఎంహెచ్​వో కార్యాలయ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: AEO Death Kamareddy | ఫార్మ్ హౌస్​లో ఏఈవో బలవన్మరణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *