Farmers Welfare Congress | రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Farmers Welfare Congress | రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (Ali Shabbir) అన్నారు. బుధవారం బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Farmers Welfare Congress | నూతన ఛైర్మన్​ సుతారి రమేష్​..

ఈ సందర్భంగా నూతన ఛైర్మన్ సుతారి రమేష్​తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతులకు పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంలో పీఏసీఎస్ లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాజకీయ భేదాలు లేకుండా ప్రతి రైతుకు సమానంగా సేవలందించాలని నూతన పాలకవర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇలియాస్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బీబీపేట్ సర్పంచ్ సాత్విక సాయి, మండల నాయకులు, సొసైటీ ఛైర్మన్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Golden Hour Road Accidents | గోల్డెన్ అవర్‌లో స్పందించి రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *