అక్షరటుడే, కామారెడ్డి: Adloor Yellareddy | రాజ్యాంగబద్ధంగా సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు. సదాశివనగర్ (Sadashivanagar) మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం ధర్నా (Farmers Protest) చేపట్టారు.
Adloor Yellareddy | ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. సీఎం, ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2004-2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, 2014-2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి సొసైటీ పాలకవర్గాలను నియమించాయన్నారు. ప్రస్తుతం మూడేళ్లుగా అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా డైరెక్ట్‌గా పదవులు కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Adloor Yellareddy | ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామని..
ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతోనే నేరుగా సొసైటీ పాలకవర్గాలను నియమిస్తోందని అన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో 65 శాతం బీసీలు ఉన్నా సొసైటీ పాలకవర్గంలో ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. రైతులుగా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకునే హక్కు తమకు ఉందని, ఖచ్చితంగా ఎన్నికల ప్రకారమే సొసైటీ పాలకవర్గాలను ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ, ఖర్గే అరెస్ట్‌పై మంత్రి పొన్నం ఫైర్!