Dubbaka School HM Suspension | దుబ్బాక జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం సస్పెన్షన్

ధర్పల్లి మండలం దుబ్బాక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్​ఎం శశికళ సస్పెన్షన్​కు గురయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Dubbaka School HM Suspension | ధర్పల్లి (Dharpally) మండలం దుబ్బాక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం శశికళ సస్పెన్షన్​కు గురయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Dubbaka School HM Suspension | విధుల పట్ల నిర్లక్ష్యం..

విధుల పట్ల అలసత్వం వహించడంతో పాటు, ఎలాంటి అనుమతులు లేకుండానే పాఠశాల సామాగ్రిని విక్రయించినట్లు ఆరోపణలను రాగా.. ఈ ఉదంతంపై కలెక్టర్​ ప్రాథమిక విచారణ జరిపించారు. ఈ సందర్భంగా పాఠశాల విధులకు హాజరుకాకుండానే హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసినట్లు, సంబంధిత అధికారుల నుండి కానీ, పాఠశాల నిర్వహణ కమిటీ నుండి (SMC) ఎలాంటి అనుమతి లేకుండానే పాఠశాలలోని జనరేటర్, ఫర్నిచర్‌ను విక్రయించినట్లు విచారణలో తేలింది. ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను కూడా విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి కావడంతో హెచ్ఎం శశికళను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: వివో V80 5G గ్రాండ్ ఎంట్రీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *