అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Crash | స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది. ముడి చమురు ధరలు పెరుగుతుండడం, ఇన్ఫ్లెషన్ భయాలు, ఈ ఏడాది మరోసారి వడ్డీ రేట్ల పెంపు తప్పకపోవచ్చన్న యూఎస్ ఫెడ్ మినిట్స్ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ మార్కెట్లను అనుసరించి సెన్సెక్స్, నిఫ్టీ సైతం భారీగా క్షీణించాయి.
Stock Market Crash | వడ్డీ రేట్ల పెంపు భయాలు..
క్రూడ్ ఆయిల్ (Crude oil) ధరలలో పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు, రూపాయి విలువలో బలహీనత మార్కెట్‌ను అనిశ్చితికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బుధవారం వడ్డీ రేట్లను పెంచింది. సమీప భవిష్యత్తులో రేట్ల పెంపు ఉండవచ్చని సంకేతాలు ఇచ్చింది. 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంపును మార్కెట్ ఊహించినా.. భవిష్యత్‌లో మళ్లీ రేట్ల పెంపు ఉండవచ్చన్న కేంద్ర బ్యాంక్ వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లు డీలా పడ్డారు. విదేశీ సంస్థాగత మదుపరుల నిరంతర పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, రూపాయి రోజుకో ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేస్తుండడం వంటి కారణాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్లు ఆవిరయ్యింది.
Stock Market Crash | ఫ్లాట్‌గా ప్రారంభమైనా..
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 30 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 25 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి ఒక్కసారిగా సెల్లాఫ్‌కు గురై 1,366 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 420 పాయింట్లు క్షీణించింది. చివరికి సెన్సెక్స్ 1,045 పాయింట్ల నష్టంతో 71,593 వద్ద, నిఫ్టీ 371 పాయింట్ల నష్టంతో 22,231 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,003 కంపెనీలు లాభపడగా 3,426 స్టాక్స్ నష్టపోయాయి. 225 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 131 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 309 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 3 కంపెనీలు లాభాలతో, 27 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 0.44 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.25 శాతం, ఇన్ఫోసిస్ 0.21 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఐటీసీ 4.24 శాతం, ఇండిగో 3.36 శాతం, పవర్‌గ్రిడ్ 3.16 శాతం, బీఈఎల్ 3.10 శాతం, అదానీపోర్ట్స్ 2.59 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Mivi One 5G | మివీ నుంచి తొలి స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో..