bob Cyber Veeru | బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త ప్రచారం.. డిజిటల్ మోసాల నుంచి రక్షణగా ‘బాబ్ సైబర్ వీరు’!

డిజిటల్ బ్యాంకింగ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, కస్టమర్లను సైబర్ మోసాల నుంచి రక్షించేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు 'బ్యాంక్ ఆఫ్ బరోడా' (Bank of Baroda) కీలక అడుగు వేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: bob Cyber Veeru | డిజిటల్ బ్యాంకింగ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, కస్టమర్లను సైబర్ మోసాల నుంచి రక్షించేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ (Bank of Baroda) కీలక అడుగు వేసింది. డిజిటల్ భద్రతపై కస్టమర్లలో అవగాహన కల్పించేందుకు ‘బాబ్ సైబర్ వీరు’ (bob Cyber Veeru) అనే సరికొత్త సైబర్‌సెక్యూరిటీ మాస్కట్‌ను (ప్రచార మస్కట్) అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ మాసాన్ని ‘జాతీయ సైబర్‌సెక్యూరిటీ అవర్‌నెస్‌ మంత్’‌గా జరుపుకుంటున్న తరుణంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

bob Cyber Veeru | స్నేహపూర్వక గైడ్..

బాబ్ సైబర్ వీరు’ ఒక ఫ్రెండ్లీ గైడ్‌లా వ్యవహరిస్తూ.. సైబర్ ముప్పులు, సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను కస్టమర్లకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. ఫిషింగ్ లింక్స్, నకిలీ కేవైసీ (KYC) కాల్స్, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్, క్యూఆర్ కోడ్, యూపీఐ (UPI) మోసాలు, స్క్రీన్-షేరింగ్ ఫ్రాడ్స్ వంటి రకరకాల సైబర్ నేరాల గురించి ఈ క్యాంపెయిన్ ద్వారా అవగాహన కల్పిస్తారు.

bob Cyber Veeru | ప్రచార విధానం..

షార్ట్ వీడియోలు, ఇన్‌ఫోగ్రాఫిక్స్, క్విక్ టిప్స్ , ఎఫ్‌ఏక్యూల (FAQs) ద్వారా సోషల్ మీడియా, ఏటీఎంలు, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఈమెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు , రేడియో ప్రచారాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ నెల అంతా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు, ఉద్యోగులకు సైబర్ సేఫ్టీపై ట్రైనింగ్ ఇస్తారు. అలాగే సైబర్ మోసాలను విజయవంతంగా అడ్డుకున్న సిబ్బందిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించనున్నారు.

డిజిటల్ బ్యాంకింగ్ మరింత సురక్షితంగా, నమ్మకంగా సాగేందుకు కస్టమర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా సమాచారం ఇచ్చే ముందు లేదా లింక్స్ క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ సూచించారు.

ఇది కూడా చదవండి:  ACB Raid | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *