అక్షరటుడే వెబ్‌డెస్క్: Yamaha Festive Offers | పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ ‘ఇండియా ( India )యమహా మోటార్’ వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. తన మోటార్ సైకిళ్లు , 125 సీసీ హైబ్రిడ్ స్కూటర్ల శ్రేణిపై ప్రత్యేక పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఆకర్షణీయమైన ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, తక్కువ డౌన్‌పేమెంట్ , సులభమైన ఫైనాన్స్ స్కీమ్‌లతో ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత యమహా డీలర్‌షిప్‌లలో ఈ పరిమితకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి
Yamaha Festive Offers | ఆఫర్ల వివరాలు..
పండుగ వేళ యమహా స్కూటర్లు, బైక్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఫాసినో 125, రేజెడ్ఆర్ 125 వంటి హైబ్రిడ్ స్కూటర్లపై రూ. 3,399 ఇన్సూరెన్స్ ప్రయోజనంతో పాటు కేవలం రూ. 2,499 తక్కువ డౌన్‌పేమెంట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఎఫ్‌జెడ్-ఎస్ సిరీస్, ఎఫ్‌జెడ్ రేవ్, ఎఫ్‌జెడ్-ఫై, ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ మోడళ్లపై రూ. 5,999 ఇన్సూరెన్స్ ప్రయోజనం, రూ. 3,900 తక్కువ డౌన్‌పేమెంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.
Yamaha Festive Offers | సులభమైన ఫైనాన్స్ ..
ఇక ఎక్స్‌ఎస్‌ఆర్ 155 (XSR155) మోటార్ సైకిల్‌పై రూ. 5,555 ఇన్సూరెన్స్ ప్రయోజనం, రూ. 4,999 డౌన్‌పేమెంట్ అందిస్తున్నారు. పాపులర్ మోడళ్లయిన ఆర్15 (R15), ఎంటీ15 (MT15) బైక్‌లకు ఇన్సూరెన్స్ ప్రయోజనం వర్తించనప్పటికీ, రూ. 4,999 తక్కువ డౌన్‌పేమెంట్‌తో వీటిని సొంతం చేసుకోవచ్చు. పండుగ సీజన్‌లో తమ డ్రీమ్ బైక్ లేదా స్కూటర్‌ను సులభమైన ఫైనాన్స్ పద్ధతిలో ఇంటికి తెచ్చుకోవాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం అని కంపెనీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Stock Market Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు