Tooth Sensitivity | వాతావరణ మార్పులతో దంతాల సున్నితత్వ సమస్య.. నివారణకు ఆయుర్వేద సంరక్షణ

కాలం మారుతున్న కొద్దీ వాతావరణంలో వచ్చే మార్పులు మన శరీరంపైనే కాకుండా దంతాల పైనా ప్రభావం చూపుతాయి.

Shivam nagarani

 అక్షరటుడే వెబ్‌డెస్క్: Tooth Sensitivity | కాలం మారుతున్న కొద్దీ వాతావరణంలో వచ్చే మార్పులు మన శరీరంపైనే కాకుండా దంతాల పైనా ప్రభావం చూపుతాయి. గాలిలో చల్లదనం పెరిగినప్పుడు వేడి టీ, కాఫీలు తాగడం లేదా ఐస్‌క్రీమ్‌లు తిన్నప్పుడు దంతాలలో ఒక్కసారిగా పదునైన నొప్పి లేదా అసౌకర్యం కలగడం గమనించవచ్చు. దీనిని చాలామంది కేవలం ఏదో ఒకసారే జరిగే సమస్యగా తేలికగా తీసుకుంటారు. కానీ, వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పులు ఇప్పటికే ఉన్న దంతాల సున్నితత్వాన్ని (Tooth Sensitivity) బయటపెట్టే ఒక సంకేతం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

Tooth Sensitivity | అసలు కారణం..

ఋతువులు మారినప్పుడు మన ఆహారపు అలవాట్లు కూడా మారుతుంటాయి. వేడి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం, చల్లని పదార్థాలు ఆస్వాదించడం వల్ల దంతాలపై ప్రభావం పడుతుంది. అరిగిపోయిన ఎనామెల్, చిగుళ్లు వెనక్కి తగ్గడం లేదా పాచి పేరుకుపోవడం వంటి కారణాల వల్ల దంతాల లోపలి పొరలు బహిర్గతమవుతాయి. దీనివల్ల వేడి, చల్లని పదార్థాలు తీసుకున్నప్పుడు దంతాలు సులభంగా అసౌకర్యానికి గురవుతాయి. అయితే ఈ ప్రారంభ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ముందే జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం.

 Tooth Sensitivity | సంరక్షణే శ్రీరామరక్ష..

సున్నితత్వం సమస్యను నివారించడానికి సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతిరోజూ సరైన నోటి సంరక్షణ దినచర్యను పాటించడం అవసరం. దంతాలను బలోపేతం చేసే టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవడం ఇందులో ప్రధాన భాగం. ఈ నేపథ్యంలో లవంగం (Clove), అల్లం (Sunthi) వంటి సహజమైన ఆయుర్వేద పదార్థాలతో తయారైన ‘డాబర్ రెడ్ టూత్‌పేస్ట్’  ( Toothpaste )దంతాల అసౌకర్యాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది చిగుళ్ల ఆరోగ్యానికి తోడ్పడటంతో పాటు రోజూవారీ సంరక్షణను అందిస్తుంది.

ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA) ఆమోదం పొందిన ఇటువంటి దంత సంరక్షణ ఉత్పత్తులను వాడటం ద్వారా ఏ కాలంలోనైనా బలమైన దంతాలు, ఆరోగ్యకరమైన చిగుళ్లను సొంతం చేసుకోవచ్చని పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ సోనియా దత్తా సూచిస్తున్నారు. రుతువులు ఏవైనా సరే, దంతాల పట్ల సరైన శ్రద్ధ తీసుకుంటే ఇటువంటి నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

ఇది కూడా చదవండి:  Stock Market Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *