CaratLane Guinness World Record | ఘనంగా క్యారెట్‌లేన్ 18వ వార్షికోత్సవం.. ఆన్‌లైన్ కేక్ కట్టింగ్‌తో ప్రపంచ రికార్డు!

ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్, టాటా కంపెనీకి చెందిన 'క్యారెట్‌లేన్' (CaratLane) తన 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: CaratLane Guinness World Record | ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్, టాటా కంపెనీకి చెందిన ‘క్యారెట్‌లేన్’ (CaratLane) తన 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆన్‌లైన్‌లో ఒకే సమయంలో అత్యధిక మంది కేక్ కట్ చేసి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ (GUINNESS WORLD RECORDS) లో చోటు సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న క్యారెట్‌లేన్ రిటైల్ స్టోర్లు, ప్రాంతీయ కార్యాలయాలు , ఫుల్లీ ఫిల్మ్‌మెంట్ కేంద్రాల నుంచి ఉద్యోగులందరూ వర్చువల్‌గా ఒక్కచోట చేరి ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.

CaratLane Guinness World Record | రికార్డు విశేషాలు..

దేశవ్యాప్తంగా 400కు పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో 467 కేక్‌లను కట్ చేశారు. సింగిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగులందరూ లైవ్‌లో కనెక్ట్ అయి ఒకే సమయంలో కేక్ కట్ చేసి ఈ రికార్డును నమోదు చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ కెమెరా ముందు కమర్షియల్ కేక్‌ను ఉంచి, మధ్యలో ఇచ్చిన సిగ్నల్ ప్రకారం కనీసం 10 సెకన్ల పాటు నిరంతరం కేక్ కట్ చేస్తూ ఈ రికార్డును పూర్తి చేశారు. ఈ ఈవెంట్‌లో ఎలాంటి ఆహారం వృథా కాకుండా, కట్ చేసిన 100% కేక్‌లను స్థానిక సిబ్బంది , చుట్టుపక్కల సమాజంతో పంచుకుని ఆస్వాదించారు.

ఈ సందర్భంగా క్యారెట్‌లేన్ మేనేజింగ్ డైరెక్టర్ సౌమెన్ భౌమిక్ మాట్లాడుతూ.. తమ 3 మిలియన్లకు పైగా వినియోగదారుల ఆదరణతోనే ఈ 18 ఏళ్ల ప్రయాణం విజయవంతమైందని తెలిపారు. ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు, వెండర్లు అందరి సహకారంతో జ్యూవెల్లరీ రంగంలో నూతన ఒరవడి సృష్టించామని, గిన్నిస్ రికార్డు సాధించడం ఈ వేడుకకు మరింత అందాన్ని తెచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Stock Market Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *