అక్షరటుడే, వెబ్‌డెస్క్: TIMS Sanathnagar Trial | హైదరాబాద్ మహా నగరంలో వైద్య రంగానికి మరో కీలక అభివృద్ధిగా మారిన సనత్‌నగర్‌లోని Telangana Institute of Medical Sciences (టిమ్స్) ప్రారంభానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి Damodar Rajanarasimha ఆదేశాల మేరకు ఆసుపత్రిలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
TIMS Sanathnagar Trial | నెల రోజుల పాటు
ఈ ట్రయల్ రన్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్‌పేషెంట్ (OP), డయాగ్నస్టిక్ సేవలు అందించనున్నారు.
TIMS Sanathnagar Trial | 22 విభాగాల్లో..
మొత్తం 22 విభాగాల్లో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ వంటి ముఖ్య విభాగాలు ఉన్నాయి.
ట్రయల్ రన్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఇప్పటికే నియమించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి సేవలు ప్రారంభానికి ముందుగా ఈ ట్రయల్ రన్ కీలకంగా మారనుంది.
Iran Gulf Tensions | పర్షియన్ గల్ఫ్‌లో ‘ఇరాన్’ కొత్త నిబంధనలు.. అమెరికాకు ఇక నో ఎంట్రీ!

