Jio Platforms IPO | జియో ఐపీవో ప్రైస్ బ్యాండ్ లీక్!..

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో ధరల శ్రేణిపై అధికారికంగా ప్రకటన రాలేదు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్‌ఫామ్స్‌ను 2019లో స్థాపించారు. ఇది మైజియో, జియోసినిమా, జియోసావన్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వంటి డిజిటల్ సేవా అప్లికేషన్లను అందిస్తోంది.

బ్యాంకింగ్, యుటిలిటీస్, రవాణా, తయారీ, ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలతో సహా ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు ఎంటర్‌ప్రైజ్ కనెక్టివిటీ, క్లౌడ్ సొల్యూషన్స్, ఐవోటీ సేవలు, యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్‌లు, మేనేజ్డ్ సర్వీసెస్, సెక్యూరిటీ సొల్యూషన్స్, ప్రైవేట్ 5జీ ఆఫరింగ్‌ల వంటి సేవలనూ ఆఫర్ చేస్తోంది. ఇది తన అధునాతన కనెక్టివిటీ మరియు డిజిటల్ సేవలతో 524 మిలియన్లకుపైగా కస్టమర్లకు సేవలు అందించింది. ప్రతి ఇంటికి సరసమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ వినోదం, గేమింగ్, క్లౌడ్ స్టోరేజ్, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ మరియు ఏఐ ఆధారిత డిజిటల్ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యమని కంపెనీ పేర్కొంటోంది.

 Jio Platforms IPO | ఒక్కో షేరు ధర ఎంతంటే?

జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో (IPO)గా ఇన్వెస్టర్ల ముందుకు వస్తోంది. సుమారు 27 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్‌ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే మార్కెట్‌లో లీకైన సమాచారం మేరకు ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 1,065 నుంచి రూ. 1,119 వరకు ఉండే అవకాశాలున్నాయి.

 Jio Platforms IPO | మెగా ఐపీవో..

దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డు సృష్టించే అవకాశాలున్నాయి. సుమారు 27 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. మార్కెట్‌లో లీకైన సమాచారం మేరకు గరిష్ట ప్రైస్ బ్యాండ్ (రూ. 1,119) వద్ద ఐపీవో ద్వారా సమీకరించే మొత్తం రూ. 30,200 కోట్లు దాటుతుంది. తద్వారా దేశంలో అతిపెద్ద ఐపీవోగా జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డు సృష్టించనుంది. ఇంతకుముందు ఈ రికార్డు హ్యుందాయ్ మోటార్స్ పేరిట ఉంది. ఆ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 27,800 కోట్లు సమీకరించింది.

 Jio Platforms IPO | ఎప్పుడు ఓపెన్ కావొచ్చంటే?

ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఈనెల 21న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 28న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావచ్చని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Godrej Gateway Returnship Program| మహిళా నిపుణుల కోసం ‘గేట్‌వే’ కార్యక్రమాన్ని ప్రారంభించిన గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *