అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chintal Cyanide Death | హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్లో గల ఓ బంగారు దుకాణంలో అనుకోకుండా సైనైడ్ మింగిన చిన్నారి (2) మృతి చెందింది. ఈ ఘటన ఈ నెల 7న చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
స్థానికంగా నివాసం ఉండే గోపీ కృష్ణ, జానకి దంపతులు ఈ నెల 7న తమ కుమార్తె మిషాతో కలిసి చింతల్‌లోని బంగారు దుకాణానికి వచ్చారు. బంగారం కొనుగోలు చేయడానికి తల్లిదండ్రులు ఆభరణాలు చూస్తుండగా.. అక్కడ టేబుల్‌పై ఉన్న సైనైడ్‌ను మిషా తీసుకొని నోట్లో పెట్టుకుంది. గమనించి దుకాణ నిర్వాహకుడు వెంటనే బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది.
Chintal Cyanide Death | కుటుంబ సభ్యుల ఆందోళన
బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి దుకాణాల్లో సైనైడ్‌ను వినియోగిస్తారు. అయితే దుకాణం యాజమాన్యం ఆ ప్రమాదకరమైన రసాయనాన్ని చిన్నారికి అందుబాటులో ఉండేలా బల్లపై ఉంచడంతో మిషా ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు దుకాణం ఎదుట ఆందోళన చేశారు. మిషాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విష్ణు జ్యువెలరీ బయట నిరసన చేపట్టారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Police | హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య